America Presidential Elections | అమెరికా అధ్యక్ష (America President Elections) ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. నవంబర్ 5 మంగళవారం పోలింగ్ జరగనుంది. యూఎస్ఏ (USA) అధ్యక్ష ఎన్నికలు ప్రతి నాలుగేళ్ల కోసారి జరుగుతాయి.
దేశంలో డెమొక్రాట్లు, రిపబ్లికన్లు అనే రెండు పార్టీలు మాత్రమే పోటీలో ఉంటాయి. మొదట్లో అమెరికాలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రోజు ఎన్నికలు జరిగేవి. దీంతో 1845లో దేశం మొత్తం ఒకేరోజు ఎన్నిక నిర్వహించే విధంగా చట్టం చేశారు. ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికలు ప్రతిసారి నవంబర్ నెలలోనే జరగుతాయి.
దీనికి ఓ కారణం ఉంది. ఆ రోజుల్లో అమెరికా సమాజం అత్యధికంగా వ్యవసాయంపై ఆధారపడేది. నవంబర్ నెలలో వ్యవసాయ పనులు ముగింపునకు వస్తాయి. అలాగే ఈ నెలలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. దీంతో అందరికీ అనుకూలంగా నవంబర్ నెలలోనే ఎన్నికలు నిర్వహించేవారు.