Monday 28th April 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > UNSTOPPABLE సీజన్ 4..ఫస్ట్ ఎపిసోడ్ లో సీఎం చంద్రబాబు

UNSTOPPABLE సీజన్ 4..ఫస్ట్ ఎపిసోడ్ లో సీఎం చంద్రబాబు

NBK’s Unstopabble S04 Starts Rolling With AP CM Chandrababu | నటసింహం నందమూరి బాలకృష్ణ ( Nandamuri Balakrishna ) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ప్రముఖ టాక్ షో అన్ స్టాపబుల్ ( Unstoppable ). ఇప్పటికే ఈ షోకు సంబంధించిన మూడు సీజన్ లు ఆహా ప్లాట్ఫార్మ్ ( Aha App ) లో విశేష ఆదరణ పొందాయి.

అక్టోబర్ 25 నుండి నాలుగవ సీజన్ టెలికాస్ట్ ( Telecast ) కానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం షోకు సంబంధించిన తొలి ఎపిసోడ్ షూటింగ్ జరిగింది. ఈ ఎపిసోడ్ లో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ( Cm Chandrababu ) కనిపించనున్నారు.

హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో చంద్రబాబుతో తొలి ఎపిసోడ్ షూటింగ్ జరిగింది. అంతేకంటే ముందు ముఖ్యమంత్రికి బాలకృష్ణ పుష్పగుచ్ఛం ఇచ్చి సెట్ లోకి ఆహ్వానించారు.

మూడవ సీజన్ లోనూ చంద్రబాబు మరియు ప్రస్తుత మంత్రి నారా లోకేశ్ ( Nara Lokesh )ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న విషయం తెల్సిందే. ఇందులో వ్యక్తిగత, రాజకీయ జీవితానికి సంబంధించిన పలు అంశాలను చంద్రబాబు పంచుకున్నారు.

You may also like
భారత్ – పాక్ ఉద్రిక్తతలపై అమెరికా కీలక సూచన!
‘లారీతో ఢీ కొట్టి వేట కొడవళ్ళతో..ఏపీలో కాంగ్రెస్ నేత దారుణ హత్య’
‘పహల్గాం ఉగ్రదాడి..NIA చేతికి కీలక ఆధారం’
‘ప్రతీ భారతీయుడి రక్తం మరుగుతోంది’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions