Friday 30th January 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ఇదేమి రాజ్యం బాబు గారు..బద్వేల్ ఘటనపై వైఎస్ జగన్

ఇదేమి రాజ్యం బాబు గారు..బద్వేల్ ఘటనపై వైఎస్ జగన్

Ys Jagan On Badvel Incident | వైఎస్సార్ కడప ( YSR Kadapa ) జిల్లా బద్వేల్ ( Badvel ) సమీపంలో ఇంటర్ విద్యార్థిని పై ప్రోమోన్మాది పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన సంచలనంగా మారింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని చికిత్స పొందుతూ మృతిచెందింది.

తాజాగా ఈ ఘటనపై మాజీ సీఎం జగన్ ( Ys Jagan ) స్పందించారు. బద్వేలులో కాలేజీ విద్యార్థినిపై పెట్రోలుపోసి, నిప్పుపెట్టి ప్రాణాలు తీసిన ఘటన అత్యంత హేయం, దుర్మార్గమని జగన్ తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

అయితే ఈ ఘటన వెనుక రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు వ్యవస్థల వైఫల్యంకూడా ఉందని విమర్శించారు. ఒక పాలకుడు ఉన్నాడంటే ప్రజలు ధైర్యంగా ఉండాల్సిందిపోయి నిరంతరం భయపడే స్థాయికి రాష్ట్రాన్ని తీసుకెళ్లారని ధ్వజమెత్తారు.

లా అండ్‌ ఆర్డర్‌ ( Law And Order )ను కాపాడలేకపోతున్నారు.. ఇదేమి రాజ్యం చంద్రబాబు ( Cm Chandrababu ) గారూ? అంటూ జగన్ ప్రశ్నించారు. మహిళలకు, బాలికలకు రక్షణకూడా ఇవ్వలేకపోతున్నారు… ఇదేమి రాజ్యం? ప్రతిరోజూ ఏదోచోట హత్యాచారాలు, హత్యలు, వేధింపులు సర్వసాధారణమైపోయాయని నిలదీశారు.

You may also like
మేడారంలో అద్భుత దృశ్యం..జనంలోకి సమ్మక్క
పోలీసులకు గుడ్ న్యూస్..బర్త్ డే, పెళ్లి రోజున సెలవులు
కేసీఆర్ కు నోటీసులు..’సూర్యుడిపై ఉమ్మివేయడమే’
తల్లి పుట్టినరోజు..జిరాఫీలను దత్తత తీసుకున్న పవన్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions