Tuesday 22nd October 2024
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > బద్వేల్ ఘటన కేసులో నిందితుడికి మరణశిక్ష పడాలి

బద్వేల్ ఘటన కేసులో నిందితుడికి మరణశిక్ష పడాలి

Cm Chandrababu On Badvel Incident | వైఎస్సార్ కడప ( YSR Kadapa ) జిల్లాలోని బద్వేల్ ( Badvel ) సమీపంలో పెట్రోల్ దాడికి గురైన ఇంటర్ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది.

కడప రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. శనివారం విద్యార్థిని పై ప్రేమోన్మాది విగ్నేష్ పెట్రోల్ ( Petrol ) పోసి నిప్పంటించిన విషయం తెల్సిందే. కాగా విద్యార్థిని మృతిచెందడం పట్ల సీఎం చంద్రబాబు ( Cm Chandrababu ) తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

ఎంతో భవిష్యత్ ఉన్న విద్యార్థిని ఒక దుర్మార్గుడి దుశ్చర్యకు బలికావడంపై ముఖ్యమంత్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడిని అరెస్టు చేశామని జిల్లా ఎస్పీ సిఎంకు వివరించారు.

వేగంగా విచారణ పూర్తి చేసి, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని సిఎం ఆదేశించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయడం అంటే….హంతకుడిని త్వరగా, చట్టబద్దంగా శిక్షించడమే అని సిఎం అన్నారు.

ఘటనలో నేరస్తుడికి మరణ శిక్ష స్థాయి శిక్ష పడేలా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. మహిళలు, ఆడబిడ్డలపై అఘాయిత్యాలు చేసేవారికి ఈ ఘటనలో పడే శిక్ష ఒక హెచ్చరికగా ఉండాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.

You may also like
‘ తాతా వచ్చాడే ‘..మనవరాలి పెళ్లిలో మాస్ స్టెప్పులేసిన మల్లారెడ్డి
అతిసారం బారినపడి మృతి చెందిన కుటుంబాలకు డిప్యూటీ సీఎం భరోసా!
మంచి మనసు చాటుకున్న మంచు లక్ష్మి..ప్రభుత్వ పాఠశాలలకు అండగా
నాగ చైతన్య శోభితా పెళ్లి పనులు షురూ

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions