Tuesday 22nd October 2024
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > 11 మంది చనిపోయినా చంద్రబాబుగారి ప్రభుత్వం నిద్ర వీడడంలేదు

11 మంది చనిపోయినా చంద్రబాబుగారి ప్రభుత్వం నిద్ర వీడడంలేదు

Ys Jagan News Latest | రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థ కుప్పకూలిపోయిందనడానికి విజయనగరం ( Vijayanagaram ) జిల్లా గుర్ల మండలంలో ప్రబలిన అతిసార ఘటనలే ప్రత్యక్ష ఉదాహరణ అని పేర్కొన్నారు మాజీ సీఎం జగన్.

11 మంది చనిపోయినా, వందల సంఖ్యలో బాధితులున్నా చంద్రబాబుగారి ప్రభుత్వం నిద్ర వీడడంలేదని విమర్శించారు.

సమీపంలోనే ఉన్న విజయనగరం, విశాఖపట్నంల్లో మంచి ఆస్పత్రులు ఉన్నా స్థానిక పాఠశాలలోని బెంచీలమీద చికిత్స అందించడం దారుణం అని మండిపడ్డారు. నాణ్యమైన అత్యవసర వైద్యాన్ని అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు.

‘లిక్కర్‌ ( Liquor ), ఇసుక స్కాంల్లో నిండామునిగిపోయిన ప్రభుత్వ పెద్దలు ప్రజల కష్టాలను గాలికొదిలేశారు. ఇప్పటికే 104, 108 వ్యవస్థలు దెబ్బతిన్నాయి. బాబుగారు వచ్చాక వీరికి సరిగా జీతాలు కూడా రావడంలేదు. ఆరోగ్యశ్రీ నిర్వీర్యం అయిపోయింది. దాదాపు రూ.1800 కోట్ల బకాయిలు గత మార్చినుంచి పెండింగ్‌లో పెట్టారు ‘ అంటూ కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు.

ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పులు ప్రజల ప్రాణాలమీదకు వస్తున్నాయని ఇప్పటికైనా తక్షణ చర్యలు తీసుకోవాలని జగన్ డిమాండ్ ( Demand ) చేశారు. డయేరియా బాధిత గ్రామాల్లో మంచి వైద్యం, తాగునీటి వనరులపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించారు.

You may also like
‘ తాతా వచ్చాడే ‘..మనవరాలి పెళ్లిలో మాస్ స్టెప్పులేసిన మల్లారెడ్డి
అతిసారం బారినపడి మృతి చెందిన కుటుంబాలకు డిప్యూటీ సీఎం భరోసా!
మంచి మనసు చాటుకున్న మంచు లక్ష్మి..ప్రభుత్వ పాఠశాలలకు అండగా
నాగ చైతన్య శోభితా పెళ్లి పనులు షురూ

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions