Wednesday 9th July 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > చంద్రబాబు గారు..ఆకలి కేకలు వినిపిస్తూనే ఉన్నాయి

చంద్రబాబు గారు..ఆకలి కేకలు వినిపిస్తూనే ఉన్నాయి

Ys Jagan On Vijayawada Floods | విజయవాడ వరద బాధితుల ( Vijayawada Floods Victims )ను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయ్యిందని విమర్శించారు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ( Ys Jagan ).

‘ చంద్రబాబు గారూ ( Chandrababu Garu )… విజయవాడలో వరద వచ్చి 8 రోజులు గడుస్తున్నా బాధితులకు ఇప్పటికీ దారీతెన్నూ లేకుండాపోయింది. ఇంకా ఆకలికేకలు వినిపిస్తూనే ఉన్నాయి. అసలు ప్రభుత్వం అనేది ఉందా? లేదా? అని అనిపిస్తోంది. వరదలకన్నా మీ నిర్వాకాల వల్ల నెలకొన్న విషాదం, మీ అసమర్థత వల్ల వచ్చిన నష్టం భారీగా ఉంది. 5 కోట్లమంది జనాభా, లక్షల కోట్ల బడ్జెట్‌ ఉన్న రాష్ట్రాన్ని నడుపుతున్న మీ ప్రభుత్వం ఐదారు లక్షలమందిని ఉదారంగా ఆదుకోలేని దీన స్థితిలో ఉందా? ఇంత చేతగాని తనమా? ఇంతటి అమానవీయత మీకు మాత్రమే సాధ్యం చంద్రబాబు గారూ. ఈ వరదలు వచ్చి 8రోజులు అవుతున్నా, 4-5రోజులుగా వర్షాలు లేకున్నా ఇంకా ప్రజలు నీటిలోనే సహాయం అందని పరిస్థితుల్లోనే ఉండడం చాలా దారుణం. అసలు ఇదంతా ఎందుకు జరిగింది? దీనికి కారణం మీరు నిర్లక్ష్యంగా వ్యవహరించడం కాదా చంద్రబాబు గారూ? ‘ అని జగన్ ఘాటుగా ప్రశ్నించారు.

You may also like
‘కళ్యాణమస్తు’ పథకానికి శ్రీకారం చుట్టిన వైఎస్సార్..కారణం ఇదే!
‘మహిళలను కించపరచే నోటివదరు వైసీపీని వదల్లేదు’
‘గురుశిష్యుల భేటీకి ఏడాది..వీరి బంధం తెలంగాణ గొంతు కొస్తోంది’
సింగయ్య మృతి..జగన్ సంచలన వ్యాఖ్యలు

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions