Saturday 21st December 2024
12:07:03 PM
Home > తాజా > ఆర్డర్ చేసిన రెండేళ్లకు ఐటమ్ డెలివరీ.. అందులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే!

ఆర్డర్ చేసిన రెండేళ్లకు ఐటమ్ డెలివరీ.. అందులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే!

amazon delivery

Amazon order Delivery After Two Year | ఈ కామర్స్ వెబ్ సైట్ లో (E Commerce) ఆర్డర్ చేసిన వస్తువులకు సంబంధించి కొన్ని వింత ఘటనలు చోటు చేసుకున్న వార్తలు అప్పుడప్పుడు వింటుంటాం. తాజాగా అలాంటి మరో వింత పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఓ వ్యక్తి అమెజాన్ లో రెండేళ్ల కిందట ఆర్డర్ చేసిన వస్తువు ఇప్పుడు డెలివరీ అయ్యింది. విచిత్రం ఏంటంటే రెండేళ్ల కిందటే ఆ వ్యక్తి ఆ ఆర్డర్ ను క్యాన్సిల్ కూడా చేశాడు.

జై అనే యువకుడు 2022 అక్టోబర్ 1న అమెజాన్ లో రైస్ కుక్కర్ ఆర్డర్ చేశాడు. కొన్ని కారణాల వల్ల ఆ ఆర్డర్ ను క్యాన్సిల్ చేశాడు.

తాజాగా రెండేళ్ల తర్వాత అతడికి పెద్ద ట్విస్ట్‌ వచ్చింది. ఆగస్టు 28 ఒక డెలివరీ బాయ్ రద్దు చేసిన ఆర్డర్‌తో అతని ఇంటి వద్దకు వచ్చాడు.

దీంతో ఆ యువకుడు ‘రెండేళ్ల తర్వాత నా ఆర్దర్ ను డెలివరీ చేసినందుకు చాలా థ్యాంక్స్’ అంటూ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. బహుశా ఆ రైస్ కుక్కర్ ని మార్స్ లో తయారు చేసి ఉంటారంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions