Monday 12th January 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > పూరి జగన్నాథుడు ప్రధాని మోదీ భక్తుడు: బీజేపీ నేత వివాదస్పద వ్యాఖ్యలు!

పూరి జగన్నాథుడు ప్రధాని మోదీ భక్తుడు: బీజేపీ నేత వివాదస్పద వ్యాఖ్యలు!

sambit patra

Sambit Patra | సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ కీలక నేత, ఆ పార్టీ పూరి లోక్సభ అభ్యర్థి సంబిత్ పాత్ర (Sambit Patra) చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి.

ఈ వివాదం నేపథ్యంలో చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు కోరిన ఈ నేత, ప్రాయశ్చిత్తంగా మూడు రోజుల ఉపవాస దీక్షకు పూనుకున్నారు.

కాగా ఇటీవల ప్రధాని మోదీ ఒడిశా లోని పూరి లో పర్యటించారు. ఈ సందర్భంగా సంబిత్ పాత్ర పలు మీడియా సంస్థలతో మాట్లాడుతూ పూరి జగన్నాథుడు ప్రధాని మోదీ భక్తుడని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దింతో ఈ వ్యాఖ్యలపై ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తీవ్రంగా స్పందించారు.

జగన్నాథుడు విశ్వానికి ప్రభువు. అలాంటి ప్రభువును కించపరిచే విదంగా వ్యాఖ్యానించడమం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జగన్నాథుడు భక్తులను, ఒడిశా ప్రజల మనోభావాలను దెబ్బ తీసిందని మండిపడ్డారు.

ఈ నేపథ్యంలో తాను నోరు జారీ ఇలాంటి వ్యాఖ్యలు చేసానని సంబిత్ పాత్ర వివరణ ఇచ్చారు. జగన్నాథుడి భక్తుడు ప్రధాని మోదీ అని చెప్పబోయి నోరిజరినట్లు క్లారిటీ ఇచ్చారు.

You may also like
evm
ఈవీఎంలకే ప్రజల ఓటు.. రాహుల్ పై బీజేపీ సెటైర్లు!
bandi sanjay kumar
కరీంనగర్ కార్పొరేషన్ పై కాషాయ జెండా ఎగరేసి తీరుతాం!
bankim babu not bankim da
‘బంకిం దా కాదు.. బంకిం బాబు అని చెప్పాలి..’ ప్రధానికి ఎంపీ సూచన!
madhavi latha
తెలంగాణలో పాకిస్తాన్ పౌరుల ఓట్లు.. సంచలన ఆరోపణలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions