TS Inter Results | తెలంగాణలో ఇంటర్మీడియెట్ (TS Inter Results) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు బుధవారం నాంపల్లిలోని ఇంటర్ బోర్డ్ కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం (Burra Venkatesham) ఈ ఫలితాలను విడుదల చేశారు.
ఇంటర్లో ఎప్పటిలాగే బాలికలు పైచేయి సాధించారు. ఫస్ట్ ఇయర్ లో 60.01 శాతం, సెకండ్ ఇయర్ లో 64.19 శాతం మంది విద్యార్థులు పాస్ అయ్యారు. కాగా ఫస్ట్ ఇయర్ లో 68.35 శాతం బాలికలు, 51.5 శాతం అబ్బాయిలు ఉత్తీర్ణత సాధించారు.
ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో రంగారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా, కామారెడ్డి జిల్లా చివరి స్థానంలో ఉంది. ఇక రెండో సంవత్సరంలో 72.53 శాతం బాలికలు, 56.1 శాతం బాలురు ఉత్తీర్ణులు అయ్యారు. సెకండ్ ఇయర్ లో ములుగు జిల్లా ప్రథమ స్థానంలో ఉండగా, కామారెడ్డి జిల్లా చివరి స్థానంలో నిలిచింది.