Friday 22nd November 2024
12:07:03 PM
Home > తాజా > తస్మాత్ జాగ్రత్త.. ఈ వెబ్ సైట్ లో చలాన్లు కట్టొద్దు!

తస్మాత్ జాగ్రత్త.. ఈ వెబ్ సైట్ లో చలాన్లు కట్టొద్దు!

fake websites

Fake Website For Traffic Challans | తెలంగాణలో పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల క్లియరెన్స్ కోసం పోలీసులు భారీ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 25 వరకు పెండింగ్ లో ఉన్న సుమారు 2 కోట్ల పెండింగ్ చలాన్లను క్లియర్ చేయించేందుకు పోలీసులు ఈ రాయితీ ప్రకటించారు.

అయితే ఈ డిస్కౌంట్ ఆఫర్‌కు వాహనదారులు సద్వినియోగం చేసుకుంటున్నారు. తమ వాహనాలపై పెండింగ్ లో ఉన్న చలాన్లను క్లియర్ చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా, ఈ డిస్కౌంట్ ఆఫర్ పై సైబర్ నేరగాళ్లు కూడా కన్నేశారు.

వాహనదారులు పెద్ద ఎత్తున చలానాలు కట్టేస్తుండంటంతో దాన్ని క్యాష్ చేసుకోవడానికి నకిలీ వెబ్ సైట్లను క్రియేట్ చేస్తున్నారు. తద్వారా చేసి వాహనదారులను బురిడీ కొట్టించి ఆ చలాన్ల డబ్బులు కొట్టేస్తున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన పోలీసులు వాహనదారులను హెచ్చరిస్తున్నారు.

మీ సేవా సెంటర్లతో పాటు https://echallan.tspolice.gov.in/publicview వెబ్ సైట్‌ల ద్వారా డిస్కౌంట్ ఆఫర్ లో చలాన్లు కట్టేందుకు అవకాశం కల్పించారు పోలీసులు. ఇదే అదునుగా చేసుకుని సైబర్ క్రైం నేరాగాళ్లు నకిలీ వైబ్ సైట్లు సృష్టించారు.

https ://echallantspolice.in/ అనే పేరుతో నకిలీ వెబ్ సైట్‌ను రూపొందించారు. దీని ద్వారా చలాన్లు వసూలు చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో నకిలీ వెబ్ సైట్లను గుర్తించిన అధికారులు సోషల్ మీడియా ద్వారా వాహనదారులను అప్రమత్తం చేశారు.

ఈ నకిలీ వెబ్ సైట్లలో చలాన్లు చెల్లించొద్దని.. పోలీసులు సూచించిన అధికారిక వెబ్‌సైట్‌లోని చెల్లించాలని సూచిస్తున్నారు. నకిలీ వెబ్ సైట్లను రూపొందించిన వారిని గుర్తించేందుకు విచారణ జరుపుతున్నట్టు తెలిపారు.

You may also like
traffic challans
పెండింగ్ చలాన్లకు భారీ డిస్కౌంట్ కానీ.. షరతు ఇదే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions