Monday 23rd December 2024
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > బాపట్ల వద్ద తీరం దాటనున్న మిగ్జామ్ తుపాను.. ఇప్పటికే ముంచెత్తుతున్న భారీ వర్షాలు!

బాపట్ల వద్ద తీరం దాటనున్న మిగ్జామ్ తుపాను.. ఇప్పటికే ముంచెత్తుతున్న భారీ వర్షాలు!

Cyclone Mijam will cross the coast at Bapatla.

-కాసేపట్లో ఏపీలో తీరం దాటనున్న పెను తుపాను..
-తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు
-ఇప్పటికే తీరాన్ని దాటిన సగ భాగం మేఘాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన మిగ్జామ్ తుపాను మరో రెండు గంటల్లో తీరాన్ని దాటబోతోంది. ఇప్పటికే తుపాను తీరాన్ని సమీపించింది. ప్రస్తుతం ఈ పెను తుపాను దక్షిణ కోస్తా తీరం వైపు ఉత్తర దిశగా కదులుతోంది. మరో మూడు, నాలుగు గంటల్లో తుపాను బాపట్ల వద్ద తీరాన్ని దాటనుంది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఇప్పటికే దట్టమైన మేఘాలు సగభాగం భూ ఉపరితలం మీదకు వచ్చేశాయి. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను తీరం దాటిన తర్వాత వర్ష తీవ్రత మరింత పెరగనుంది. తుపాను ప్రస్తుతం కావలికి 40 కిలోమీటర్లు, బాపట్లకు 40 కిలోమీటర్లు, నెల్లూరుకు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. తుపాను గంటకు 12 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు దూసుకొస్తోంది.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions