Sunday 24th November 2024
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > నేషనల్ యూత్ వాలంటీర్ స్కీం.. నెలకు రూ. 5 వేలు పొందండిలా!

నేషనల్ యూత్ వాలంటీర్ స్కీం.. నెలకు రూ. 5 వేలు పొందండిలా!

Youth

National Youth Volunteer Scheme | “ప్రార్ధించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న” అని మన పెద్దలు ఎప్పుడు చెపుతూ ఉంటారు. అలా సమాజ వృద్ధి కోసం సహాయం చేయాలనుకునే యువతకు మంచి అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుంది.

తమ ప్రాంతంలో కొంతకాలం పాటు వాలంటీర్లుగా పనిచేసేందుకు కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్ యూత్ వాలంటీర్’ ( National Youth Volunteer) పథకాన్ని అమలు చేస్తోంది.

ఈ పథకంలో చేరి వాలంటీర్లుగా పనిచేసే వారికి కేంద్ర ప్రభుత్వం (Union Governament) నెలకు రూ.5000 గౌరవ వేతనం కూడా అందజేస్తోంది.

స్కీం ప్రత్యేకత..

ఈ పథకం కింద చేరిన వారిని ‘నేషనల్ యూత్ కాప్స్’ (National Youth Corps) అని కూడా అంటారు.

ఈ పథకాన్ని 2011 నుండి యూనియన్ యూత్ అండ్ స్పోర్ట్స్ డిపార్ట్‌మెంట్ ( Union Youth And Sports Department ) నేతృత్వంలోని ‘నెహ్రూ యువ కేంద్ర సంఘటన్’ పర్యవేక్షిస్తోంది.

దీని కింద అభ్యర్థులు గరిష్టంగా రెండేళ్లపాటు వాలంటీర్‌గా పనిచేసే అవకాశం కల్పిస్తారు. ఈ సమయంలో వారికి నెలకు రూ. 5000 గౌరవ వేతనం అందజేస్తారు.

ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కింద 12,000 మంది వాలంటీర్లను ఎంపిక చేస్తుంది. ఆయా రాష్ట్రాల్లోని బ్లాక్ లెవల్ (Block Level) ఏరియాలకు (Areas) పంపి అక్కడ సేవలందిస్తారు.

ఎవరు అర్హులు..? ( Who Is Elgible )
ఈ పథకంలో వాలంటీర్‌గా చేరాలనుకునే వారి వయస్సు 18 నుండి 29 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు మొదట నాలుగు వారాల శిక్షణ ఇస్తారు.

విద్యార్హతలు ఏంటి..? ( Education Qualification )
ఈ పథకంలో చేరాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

గ్రాడ్యుయేషన్ (Graduation) పూర్తి చేసి, సాంకేతిక నైపుణ్యాలు కలిగిన అభ్యర్థులకు నేషనల్ యూత్ వాలంటీర్‌గా ఎంపికలో ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

ఆండ్రాయిడ్ ఫోన్‌ ( Android Phone )తో పాటు వివిధ రకాల యాప్‌ (App)లను ఉపయోగించడంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

కళాశాలల్లో రెగ్యులర్ ( Regular ) విద్యార్థులుగా చదువుతున్న విద్యార్థులు ఈ పథకానికి అర్హులు కారు. వారు తమ కళాశాలల్లో NCC లేదా NSS పథకాలలో చేరవచ్చు.

వాలంటీర్లు చేయాల్సిన సేవలేంటి..? ( Job Of An Volunteer )
నేషనల్ యూత్ వాలంటీర్ లేదా నేషనల్ యూత్ కాప్‌గా ఎంపికైన వారిని నెహ్రూ యువజన కేంద్రం అధికారులు ఆయా ప్రాంతాల్లోని బ్లాక్ స్థాయికి తీసుకెళ్లి సామాజిక సేవలు అందిస్తారు.

ఒక జోన్ లేదా రెండు మండలాలు కలిపి బ్లాక్‌గా పరిగణిస్తారు.

ఆ ప్రాంతంలోని పంచాయతీల్లోని సామాజిక సమస్యలు, సమస్యలపై చైతన్య అక్కడి ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉంది. ఆ ప్రాంతంలోని సమస్యలపై నివేదిక సమర్పించాలి.

మహిళా వాలంటీర్లు ఆయా ప్రాంత మహిళలను చైతన్యవంతం చేసి సమకాలీన సమస్యలపై అవగాహన కల్పించాలి.

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై ఈ ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించాలి.

స్కిల్ ఇండియా, క్లీన్ ఇండియా, ఫిట్ ఇండియా, అజాదికా అమృత్ కాల్ వంటి కార్యక్రమాలు కూడా ఆయా పంచాయతీల్లో నిర్వహించాలి.

ప్లాస్టిక్‌ రహిత పంచాయతీలుగా తీర్చిదిద్దేందుకు స్వచ్ఛ భారత్‌ కార్యక్రమాలను వాలంటీర్లు నిర్వహిస్తారు.

ఎలా దరఖాస్తు చేయాలి? (How To Apply)
ఆన్‌లైన్‌ ( Online )లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించి ఆయా జిల్లాల కలెక్టర్లు యూత్ వాలంటీర్ల నియామకానికి నోటిఫికేషన్ ( Notification) విడుదల చేయనున్నారు.

ఆ ప్రాంతంలోని ప్రముఖ వార్తాపత్రికల్లో కూడా ప్రకటనలు ఇస్తారు. అప్పుడు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము అవసరం లేదు.

ఏ పత్రాలు అందించాలి? (Required Documents)
పాస్ పోర్ట్ సైజ్ ఫోటో
ఆధార్ కార్డు
10వ తరగతి మార్కుల జాబితా
కుల ధృవీకరణ పత్రం (SC, ST, OBC)
ఉన్నత విద్యా అర్హతల సర్టిఫికెట్లు, ఏదైనా ఉంటే
మీ చిరునామా రుజువు (ఓటర్ ID కార్డ్, ఆధార్ కార్డ్/డ్రైవింగ్ లైసెన్స్/రేషన్ కార్డ్)

ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది? (Selection Process)

కలెక్టర్ నేతృత్వంలో జిల్లా యువజన వ్యవహారాల అధికారితో పాటు అనుభవజ్ఞులైన మరో ఇద్దరు సభ్యులతో కూడిన కమిటీ ఉంటుంది. ఇది దరఖాస్తులను సమీక్షించి, వాలంటీర్లను ఎంపిక చేస్తుంది.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions