Thursday 21st November 2024
12:07:03 PM
Home > తెలంగాణ > అసదుద్దిన్ కీలక వ్యాఖ్యలు.. ఎన్నికల ముందు కేసీఆర్ కు ఒవైసీ షాక్!

అసదుద్దిన్ కీలక వ్యాఖ్యలు.. ఎన్నికల ముందు కేసీఆర్ కు ఒవైసీ షాక్!

asaduddin owasi

MIM Chief Asaduddin Owaisi | హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం (AIMIM) పార్టీ అధ్యక్షులు, అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ లో బీఆరెస్ అధికారం లోకి వచ్చినప్పటి నుండి స్నేహం గా మెలిగిన ఒవైసీ, ఈరోజు బోధన్ పర్యటన లో ఆసక్తికర విషయాలు మాట్లాడారు.

బోధన్ బీఆరెస్ ఎమ్మెల్యే షకీల్ ని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. ఆయన వ్యవహార సరళి బాగాలేదని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు అతనికి బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు.

అలాగే రాబోయే ఎన్నికల్లో వీలైనన్ని అత్యధిక సీట్లలో పోటీ చేస్తామని చెప్పారు.

వ్యాఖ్యల వెనుక అంతర్యమేంటి?

హైదరాబాద్ లో తమ కోటని పదిలంగ కాపాడుకోవడానికి ఎంఐఎం పార్టీ ఎప్పుడూ అధికారం లో ఉన్న పార్టీతో సఖ్యతగా మెలిగేది. ఇందులో భాగంగానే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా టీఆరెస్ తో స్నేహ హస్తాన్ని అందించింది.

అలాగే ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలు పైకి ఎన్ని విమర్శలు చేసిన లోపాయికారి ఒప్పందం ఉందనే విషయం అందరికీ తెలిసిందే.

ఇదిలా ఉండగా ఒవైసీ మాత్రం తన పార్టీని దేశం లోని ఇతర రాష్ట్రాల్లో విస్తరించారు. అందులో భాగంగానే ఉత్తర ప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర లో పార్టీ ని బలోపేతం చేసి కొన్ని విజయాలు కూడా లభించాయి.

కానీ ఏంఐఎం పార్టీ, ఒవైసీ వైఖరి పై ప్రతిపక్షాలలో ఎప్పుడు ఒక అనుమానం ఉంటూనే వస్తుంది. ఒవైసీ కేవలం బీజేపీ కోసమే తన పార్టీ ని విస్తరిస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

దీనికి కారణాలు కూడా లేకపోలేదు. బీజేపీ ఎక్కడ గెలవాలని చూస్తుందో అక్కడ ఒవైసీ తన అభ్యర్థులని ప్రకటిస్తున్నారు.

తద్వారా బీజేపీ ఎంఐఎం  పార్టీ ల మధ్య మతపరమైన విభజనతో ఓట్ల చీలికకు కారణమవుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

కానీ బయట ఎలా ఉన్నా తెలంగాణ లో మాత్రం ఎంఐఎం పార్టీ కేసీఆర్ తో మైత్రిపూర్వకంగానే ఉంటూ వస్తోంది.

అలాగే జిహెచ్ఎంసి ఎన్నికల్లో బీఆరెస్ కి సీట్లు తక్కువ అయితే ఎంఐఎం పార్టీనే మద్దతు ప్రకటించింది.

ఇంతటి అనుబంధం ఉన్న బీఆరెస్ తో ఒవైసి అధిక సీట్లలో పోటీ చేస్తా అనడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.

ఒవైసి తెలంగాణ లో అధిక సీట్లలో పోటీ చేయడం ద్వారా మైనారిటీ ఓట్లని బీఆరెస్ కి దూరం చేస్తాడా అనే అనుమానం కలుగక మానదు.

అలాగే ఒవైసి మాట్లాడుతూ ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలో భవిష్యత్ లో ఆలోచిస్తాం అనడం కూడా విచిత్రంగా ఉంది.  

You may also like
harish rao
ఇది 8 పర్సెంట్ గవర్నమెంట్.. హరీశ్ రావు విమర్శలు!
vemula veeresham
టేబుల్ మీద వెపన్ పెట్టి బెదిరించారు: కాంగ్రెస్ ఎమ్మెల్యే!
telangana high court
‘బీఆర్ఎస్ ఆఫీస్ ను కూల్చేయండి’.. హైకోర్టు కీలక ఆదేశాలు!
kcr
హలో కులకర్ణి.. ఆరోగ్యం ఎట్లుంది? కార్యకర్తకు కేసీఆర్ పరామర్శ!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions