Chennai Man Spends Rs 1 Lakh On Condoms In A Year Via Swiggy Instamart | దేశ వ్యాప్తంగా ఆన్లైన్ డెలివరీ యాప్స్ వినిమయం అధికం అయ్యింది. పాల నుంచి ఐఫోన్ల వరకు, కరివేపాకు నుండి బంగారం వరకు ఏది కావాలన్నా క్విక్ కామర్స్ యాప్స్ లో సులభంగా దొరికేస్తున్నాయి. ఇలా దేశంలోని కస్టమర్లు వేటిని అధికంగా ఆర్డర్ చేశారు అనే వివరాలతో కూడిన నివేదికను విడుదల చేసింది ప్రముఖ క్విక్ కామర్స్ సంస్థ స్విగ్గి ఇనస్టామార్ట్.
2025 యాన్యువల్ ఆర్డర్ అనాలిసిస్ పేరిట ఇది విడుదలైంది. ఇందులో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. బెంగళూరుకు చెందిన ఓ యూజర్ కేవలం నూడుల్స్ కోసమే ఏకంగా రూ.4.36 లక్షలు ఖర్చు చేశాడు. చెన్నైకి చెందిన మరో యూజర్ కండోమ్స్ కోసమే ఏకంగా రూ.లక్ష ఖర్చు చేశాడు. 2025లో అతడు వివిధ సమయాల్లో 228 సార్లు కండోమ్స్ ఆర్డర్ చేశాడు. ఇకపోతే ఇనస్టామార్ట్ లో 127 ఆర్డర్ లో ఒకటి కండోమ్ ఆర్డర్ ఉంటుంది.
ముంబయి కి చెందిన మరో యూజర్ రెడ్ బుల్ షుగర్ ఫ్రీ డ్రింక్ కోసం ఈ ఏడాదిలో రూ.16 లక్షల విలువైన ఆర్దర్లు చేశాడు. బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి కనిష్టంగా రూ.10 చెల్లించి కరివేపాకు ఆర్డర్ చేశాడు. కొచ్చికి చెందిన ఓ వ్యక్తి 2025లో 368 సార్లు కరివేపాను ఆర్డర్ పెట్టినట్లు నివేదికలో పేర్కొంది ఇనస్టామార్ట్. కరివేపాకు, పాలు, పెరుగు, అరటిపళ్ళు వంటివి దేశవ్యాప్తంగా ఎక్కువగా ఆర్డర్ చేసిన లిస్టులో ఉన్నాయి.









