Ys Jagan Serious On Chittoore Police | చిత్తూరు జిల్లా పోలీసులపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మామిడి రైతులను కలిసేందుకు జగన్ బుధవారం చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలోని మార్కెట్ యార్డుకు వెళ్లారు. అంతేకంటే ముందు జగన్ వచ్చిన నేపథ్యంలో భారీగా వైసీపీ శ్రేణులు తరలివచ్చారు. ఇదే సమయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
వైసీపీ కార్యకర్తపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారని నేతలు ఆరోపించారు. ఇందులో చంద్రగిరి యువజన విభాగం కార్యదర్శి శశిధర్ రెడ్డి తలకు గాయం అయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సదరు కార్యకర్తను కలిసేందుకు జగన్ తన కాన్వాయ్ నుండి బయటకు వచ్చారు.
ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన జిల్లా ఎస్పీ, జగన్ ను కాన్వాయ్ దిగవద్దని పరిస్థితులు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని చెప్పారు. దింతో జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గాయపడ్డ పార్టీ నేతను పరామర్శించనివ్వరా అంటూ ఆగ్రహించారు.