Ys Jagan News | పార్టీ నాయకుడి కుమారుడికి వైసీపీ అధినేత జగన్ నామకరణం చేశారు. వైఎస్సార్‌సీపీ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ను కలిసి తమ కుమారుడికి నామకరణం చేయాలని గోపాలపురం నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్సీపీ ఐటీ వింగ్ ప్రెసిడెంట్ కొండాబత్తుల గిరి, జ్యోతి దంపతులు కోరారు.
ఈ నేపథ్యంలో గిరి, జ్యోతి దంపతుల కోరిక మేరకు వారిని అడిగి తెలుసుకుని కుమారుడికి కెవిన్ అనే పేరును జగన్ పెట్టారు. అనంతరం చిన్నారిని లాలించారు. తమ కుమారుడికి వైయస్ జగన్ చేతుల మీదుగా నామకరణం జరిగినందుకు గిరి దంపతులు సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వైసీపీ తరుపున సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నాననే కారణంతో ఇప్పటికి మూడు సార్లు తనను ద్వారకా తిరుమల పోలీసులు స్టేషన్‌కు పిలిచి ఇబ్బందులు పెడుతున్నారని వైయస్ జగన్‌కు గిరి వివరించారు.
దీనిపై స్పందించిన జగన్ వైసీపీ లీగల్ సెల్ కచ్చితంగా అండగా ఉంటుందని భరోసా కల్పించారు.









