Sunday 22nd December 2024
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > అల్లు అర్జున్ అరెస్టును ఖండించిన వైఎస్ జగన్

అల్లు అర్జున్ అరెస్టును ఖండించిన వైఎస్ జగన్

Ys Jagan Condemns Allu Arjun Arrest | నటుడు అల్లు అర్జున్ అరెస్టును మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ ఖండించారు.

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. ఈ క్రమంలో జగన్ స్పందించారు.

‘ హైదరాబాద్‌ సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్ల ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఎవ్వరూ తీర్చలేనిది. అదే సమయంలో దీనిపై అల్లు అర్జున్ తన విచారాన్ని వ్యక్తంచేసి, ఆ కుటుంబానికి అండగా ఉంటానంటూ బాధ్యతాయుతంగా వ్యవహరించారు. అయితే ఈ ఘటనకు నేరుగా అతడ్ని బాధ్యుడ్ని చేయడం ఎంతవరకు సమంజసం? తొక్కిసలాట ఘటనలో తన ప్రమేయం లేకపోయినా అర్జున్‌పై క్రిమినల్‌ కేసులు బనాయించి, అరెస్టు చేయడం సమ్మతంకాదు. అల్లు అర్జున్‌ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను. ‘ అని జగన్ పోస్ట్ చేశారు.

You may also like
సీఎం రేవంత్ ప్రకటన..సంక్రాంతికి వచ్చే సినిమాల పరిస్థితి ఏంటో ?
ఇన్నోవా కారులో 52 కిలోల బంగారం..రూ.10 కోట్ల డబ్బులు
అల్లు అర్జున్ మళ్లీ జైలుకు వెళ్తారా ?
మహిళ చనిపోయిందంటే సినిమా హిట్ అని అల్లు అర్జున్ నవ్వాడు

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions