Monday 23rd December 2024
12:07:03 PM
Home > E-Paper > ఏపీ సీఎం చంద్రబాబు మనవడుదేవాన్ష్ వరల్డ్ రికార్డ్!

ఏపీ సీఎం చంద్రబాబు మనవడుదేవాన్ష్ వరల్డ్ రికార్డ్!

World Record For Nara Lokesh Son Nara Devansh | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మనవడు, మంత్రి నారా లోకేష్ కుమారుడు నారా దేవాన్ష్ ప్రపంచ రికార్డు సాధించాడు. చెస్ లో క్లిష్టమైన 175 పజిల్స్ ను వేగంగా పరిష్కరించి కేవలం 9 ఏళ్ల వయసులోనే ఫాస్టెస్ట్ చెక్ మేట్ సాల్వర్ 175 పజిల్స్ రికార్డును సొంతం చేసుకున్నాడు. దీంతోపాటు మరో రెండు రికార్డులను సాధించినట్లు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ అధికారికంగా ధృవీకరించింది. సెవెన్ డిస్క్ టవర్ ఆఫ్ హనోయిని కేవలం ఒక్క నిమిషం 43 సెకన్లలో పూర్తి చేశాడు. అదేవిధంగా 9 చెస్ బోర్డ్‌ లను కేవలం 5 నిమిషాల్లో అమర్చాడు, మొత్తం 32 ముక్కలను వేగంగా సరైన స్థానాల్లో ఉంచి.. నారా దేవాన్ష్ రికార్డు సాధించాడు. దేవాన్ష్ ప్రపంచ రికార్డు పట్ల అతడి తండ్రి నారా లోకేష్ సంతోషం వ్యక్తం చేశారు. దేవాన్ష్ లేజర్ షార్ప్ ఫోకస్‌తో శిక్షణ పొందడం తాను ప్రత్యక్షంగా చూశానని లోకేష్ తెలిపారు. ప్రపంచస్థాయి పోటీలలో భారతీయ చెస్ క్రీడాకారులు సాధిస్తున్న విజయాల నుంచి దేవాన్ష్ స్ఫూర్తిని పొందాడని నారా లోకేష్ చెప్పారు. నారా దేవాన్ష్‌ కు చెస్‌ పాఠాలు నేర్పిన రాయ్ చెస్ అకాడమీకి మంత్రి ధన్యవాదాలు తెలియజేశారు.

You may also like
చంద్రబాబు గారు..రైతులను రోడ్డున పడేశావ్ : జగన్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions