Saturday 11th April 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > రియల్ లైఫ్ శుభలగ్నం.. భర్తను ప్రియురాలికి అమ్మేసిన భార్య!

రియల్ లైఫ్ శుభలగ్నం.. భర్తను ప్రియురాలికి అమ్మేసిన భార్య!

wife sells her husband

WIFE SELLS HER HUSBAND | తెలుగులో శుభలగ్నం అనే సినిమా గుర్తుందా. ఆ సినిమాలో భార్య తన భర్తను అతడిని ప్రేమించిన మహిళకు కోటి రూపాయలకు అమ్మేస్తుంది. అది సినిమా. కానీ, ఆ సినిమాలో మాదిరిగానే అచ్చం అలాంటి ఘటనే మధ్య ప్రదేశ్ లో చోటు చేసుకుంది.

ఈ ఘటనలో ఇద్దరు పిల్లల తల్లి తన భర్తను రూ.1.5 కోట్లకు మరో మహిళకు అప్పగించేసింది. ఆ డబ్బుతో తన పిల్లలను తీసుకొని మరో ప్రాంతానికి వెళ్లిపోయింది. అయితే ఈ అగ్రిమెంట్ ఏకంగా న్యాయస్థానం సమక్షంలోనే జరగడం కొసమెరుపు. 

వివరాల్లోకి వెళితే.. భోపాల్ కు చెందిన 42 ఏండ్ల వ్యక్తికి 23 ఏండ్ల క్రితం పెళ్లయింది. వారికి ఇద్దరు అమ్మాయిలు. అయితే ఇటీవల తన తండ్రి ఆయన పనిచేసే ఆఫీస్ లో 54 ఏళ్ల మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తమను నిర్లక్ష్యం చేస్తున్నాడంటూ పెద్ద కుమార్తె ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేసింది.

దీంతో కోర్టు భార్యాభర్తలతోపాటు అతని ప్రియురాలిని కౌన్సెలింగ్ కి పిలిచింది. అప్పుడు తాను ప్రియురాలితోనే ఉంటానని ఆ వ్యక్తి స్పష్టం చేశాడు. దీంతో తన భర్తను ప్రియురాలికి వదిలిపెట్టడానికి రూ.1.5 కోట్లు ఇవ్వాలని భార్య డిమాండ్ చేసింది.

దీనికి ప్రియురాలు కూడా అంగీకరించడంతో వారికి విడాకులు మంజూరు అయ్యాయి. ఆ భార్యకు ఒక డూప్లెక్స్ ఇంటితో పాటు 27 లక్షల నగదును ప్రియురాలు చెల్లించడంతో ఆమె తన ఇద్దరు పిల్లలతో అందులోకి మారిపోనుంది.

You may also like
భర్త సీఎం..భార్య ఎమ్మెల్యే..అసెంబ్లీలోనే ప్రశ్నించిన సతీమణి!
ys jagan
మీ తండ్రి వారసత్వాన్ని తాకట్టు పెట్టకండి.. వైఎస్ జగన్ కు యూత్ కాంగ్రెస్ కౌంటర్!
old tractor makes a man millionaire overnight
పనికి రాని పాత ట్రాక్టర్ రాత్రికి రాత్రేకోటీశ్వరుడిని చేసింది.. ఎలాగో తెలుసా!
bravery girl saves toddlers for faulty elevator
లిఫ్ట్ ప్రమాదం నుంచి చిన్నారులను కాపాడిన బాలిక.. వీడియో వైరల్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions