Union Budget 2025 Nirmala Sitharaman’s Speech | కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను పార్లమెంటులో బడ్జెట్ ( Union Budget ) ను ప్రవేశపెట్టారు.
ఆర్థిక మంత్రిగా ఆమె ఎనిమిదవ బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. తెలుగు కవి గురజాడ అప్పారావు కవితతో ఆమె బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘దేశమంటే మట్టికాదోయ్..దేశమంటే మనుషులోయ్’ అంటూ గురజాడ సూక్తి వ్యాఖ్యలు ప్రస్తావించారు.
అంతేకంటే ముందు బడ్జెట్ ట్యాబును తీసుకుని నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు రాష్ట్రపతి అనుమతి తీసుకున్నారు.
అనంతరం పార్లమెంటు కు చేరుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర కేబినెట్ బడ్జెట్ ను ఆమోద ముద్రవేసింది.