TVK Declares Actor Vijay As CM Candidate For 2026 | తమిళనాడు శాసనసభ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో తమిళగ వెట్రి కళగం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.
తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు తళపతి విజయ్ ను ప్రకటించింది. ఈ మేరకు టీవికే కార్యనిర్వాహక మండలి తీర్మానించింది. అలాగే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని, ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు టీవీకే స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో విజయ్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతా పార్టీ కార్యకలాపాలు ఎక్కడైనా కొనసాగుతాయని, కానీ తమిళనాడులో మాత్రం కాదన్నారు. వేర్పాటువాదులతో పొత్తు ఉండదని ప్రకటించారు.