Monday 16th September 2024
12:07:03 PM
Home > తాజా > మేడారం జాతర షురూ.. ప్రయాణికులకు సజ్జనార్ విజ్ఞప్తి!

మేడారం జాతర షురూ.. ప్రయాణికులకు సజ్జనార్ విజ్ఞప్తి!

Sajjanar

Medaram Festival | మేడారం జాతర ప్రారంభమైన నేపథ్యంలో టీఎస్ఆర్టీసీలో ప్రయాణించే సాధారణ ప్రయాణికులకు ఆ సంస్థ ఎండి సజ్జనర్ కీలక సందేశాన్ని ఇచ్చారు.

“తెలంగాణ కుంభమేళాగా ప్రాచుర్యం పొందిన మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతరకు తరలివచ్చే భక్తజన సౌకర్యార్థం టీఎస్ఆర్టీసీ 6 వేల ప్రత్యేక బస్సులను నడుపుతోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బస్సులు ఇప్పటికే మేడారానికి వెళ్లాయి.

జాతరకు మహాలక్ష్మి పథకం అమలు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ గారి ఆదేశాల మేరకు భక్తులకు అసౌకర్యం కలగకుండా యాజమాన్యం అన్ని చర్యలు తీసుకుంటోంది.

భక్తులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు  ఇంత పెద్దమొత్తంలో బస్సులను మేడారం జాతరకు తిప్పుతున్నందున రెగ్యూలర్ సర్వీసులను తగ్గించడం జరిగింది.

దీంతో సాధారణ ప్రయాణికులకు కొంత అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. కావున జాతర సమయంలో భక్తులకు, ఆర్టీసీ సిబ్బందికి పెద్ద మనుసుతో సహకరించాలని సాధారణ ప్రయాణికులకు విజ్ఞప్తి చేస్తున్నాను. జాతర పూర్తయ్యేవరకు తగు ఏర్పాట్లు చేసుకోవాలని వారిని కోరుతున్నాను.

తెలంగాణకే తలమానికమైన ఈ జాతరను విజయవంతం చేయడానికి ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.” అని కోరారు సజ్జనార్. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

You may also like
tsrtc
రాఖీ పౌర్ణమి రోజు ఆర్టీసీ సరికొత్త రికార్డ్!
karimnagar women
బస్టాండ్ లో గర్భిణికి ప్రసవం చేసిన ఆర్టీసీ సిబ్బంది!
attack on ts rtc
ఆర్టీసీ బస్ పై దుండుగల దాడి.. తప్పిన ప్రమాదం!
PM Modi
సమ్మక్క-సారక్క పరాక్రమాన్నిగుర్తుచేసుకుందాం: ప్రధాని మోదీ

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions