Traffice Police Funny Tweet | ఇటీవల హైదరాబాద్ లో కుమారి ఆంటీ ఫుడ్ కోర్టు (Kumari Aunty Food Court) సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. నగరంలోని ఐటీసీ కోహినూర్ (ITC Kohinoor) సమీపంలో ఉన్న ఈ ఫుడ్ కోర్టు పెద్ద ఎత్తున భోజన ప్రియులు క్యూ కట్టారు.
దీంతో ట్రాఫిక్ జాం కారణంగా ఆమె ఫుడ్ కోర్ట్ ని మూసివేయాలని పోలీసులు ఆదేశించారు. అయితే మరుసటి రోజే సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని ఆ ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని సూచించారు. స్వయంగా ఆయన కూడా కుమారి ఆంటీ ఫుడ్ కోర్టును సందర్శిస్తానని పేర్కొన్నారు. దీంతో కుమారి ఆంటీ ఫుడ్ కోర్టు రెండు తెలుగు రాష్ట్రాల్లో వార్తల్లో నిలిచింది.
ఇదిలా ఉండగా కుమారి ఆంటీ చెప్పిన మాటలతో సోషల్ మీడియాలో తెగ మీమ్స్ వైరల్ అయ్యాయి. మీది మొత్తం 1000 అయ్యింది రెండు లివర్ లు ఎక్సట్రా అనే మాటలతో నెటిజన్లు మీమ్స్ చేశారు. తాజాగా ఆ జాబితాలో హైదరాబాద్ పోలీసులు కూడా చేరారు.
ఓ వ్యక్తి హెల్మెట్ లేకుండా సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్న ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేశారు పోలీసులు. మీది మొత్తం 1000 అయ్యింది. యూజర్ ఛార్జెస్ ఎక్స్ ట్రా అంటూ క్యాప్షన్ యాడ్ చేశారు. దీంతో పోలీసుల హ్యూమర్ కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.