Tirupati Stampede News | తిరుమల చరిత్రలోనే తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బుధవారం రాత్రి తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతిచెందారు.
తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల ( Tokens ) కేంద్రం వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందగా సుమారు 50 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
ఈ క్రమంలో తొక్కిసలాటలో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో మృతుల కుటుంబాలను మంత్రులు అనగాని, అనిత, పార్థసారథి, ఆనం రామనారాయణ రెడ్డి పరామర్శించారు.
అలాగే స్విమ్స్ ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించి వైద్యులతో మాట్లాడారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ..తొక్కిసలాట ఘటన ప్రమాదమా ? లేక కుట్రనా అనే కోణంలో విచారణ జరుగుతున్నట్లు పేర్కొన్నారు. భాద్యులు ఏ స్థాయిలో ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.