Miss World Opal Suchatha Story | హైదరాబాద్ లోని హైటెక్స్ వేదికగా జరిగిన మిస్ వరల్డ్ (Miss World) పోటీల్లో థాయ్ లాండ్ (Thailand) సుందరి ఓపల్ సుచాతా టైటిల్ గెల్చుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆమె మిస్ వరల్డ్ కిరీటంతో పాటు 1 మిలియన్ అమెరికన్ డాలర్లు ప్రైజ్ మనీగా అందుకున్నారు.
ఓపల్ సుచాతా థాయ్ లాండ్ లోని పుకెట్ లో జన్మించారు. బ్యాంకాక్ లోని థామసాట్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ లో బ్యాచిలర్ డిగ్రీ చదవుతున్నారు. ఆమె గత నాలుగేళ్లుగా మోడలింగ్ రంగంలో ఉన్నారు. 2021లో మిస్ రట్టనకోసిన్ పోటీలతో తన అందాల పోటీల ప్రస్థానాన్ని ప్రారంభించారు.
2022లో మిస్ యూనివర్స్ థాయ్‌లాండ్ పోటీల్లో పాల్గొని మూడో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత రెండో రన్నరప్ తప్పుకోవడంతో ఆమె రెండో స్థానానికి ప్రమోట్ అయ్యారు. అయితే ఈ మిస్ యూనివర్స్ టైటిల్ విన్నర్ వెనక ఓ కన్నీటి గాథ ఉంది.
తనకు పదహారేళ్ల వయసులో రొమ్ము క్యాన్సర్ బారిన పడ్డారు ఓపల్ సుచాత. బ్రెస్ట్ లో కణితిని గుర్తించగా, సకాలంలో చికిత్స తీసుకోవడంతో కోలుకొని క్యాన్సర్ ను జయించారు. ప్రపంచవ్యాప్తంగా మహిళలను వేధించే ఈ సమస్యను దూరం చేయాలంటే ప్రజల్లో అవగాహన చాలా అవసరమని భావించి, ‘ఓపల్ ఫర్ హర్’ అనే పేరుతో రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు.
మిస్ వరల్డ్ ఓపల్ సుచాత విజయం వెనక కన్నీటి కథ!





