Minister Vakiti Srihari | తెలంగాణ క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari) మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. సోమవారం ఉదయం బెంగుళూరు జాతీయ రహదారి పై భూత్పూర్ వద్ద హైదరాబాద్ నుండి కర్నూల్ వెళ్తున్న కారు ప్రమాదానికి గురైంది. వనపర్తి పర్యటన కు వెళ్తున్న మంత్రి శ్రీహరి కాన్వాయ్ కి అతి సమీపంలో ఈ కారు ప్రమాదం జరగడంతో వెంటనే మంత్రి తన సెక్యూరిటీ సిబ్బంది తో కారు నడుపుతున్న వృద్ధుడిని స్వయంగా బయటకు తీశారు. అదృష్టవషాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ఏం కాలేదు. కారు లో ప్రయాణిస్తున్న వారికి మంత్రి ధైర్యం చెప్పారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులకు వేరే వాహనంలో బాధితులను కర్నూల్ కు పంపవలసిందిగా సూచించారు. ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచిన మంత్రి వాకిటి శ్రీహరిని పలువురు ప్రశంసించారు.









