Monday 16th March 2026
12:07:03 PM
Home > తాజా > పరేడ్ గ్రౌండ్ లో రిపబ్లిక్ డే వేడుకలు..

పరేడ్ గ్రౌండ్ లో రిపబ్లిక్ డే వేడుకలు..

jisnhu dev varma unfurls national flag

‌ పరేడ్ గ్రౌండ్ లో రిపబ్లిక్ డే వేడుకలు..జెండా ఆవిష్కరించిన గవర్నర్!

Republic Day in Parade Grounds | తెలంగాణ (Telangana) రాష్ట్రవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు (Republic Day 2026) ఘనంగా జరిగాయి. హైదరాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో పరేడ్‌ గ్రౌండ్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జాతీయ జెండాను ఆవిష్కరించారు.

అనంతరం ఆయన పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించి ప్రసంగించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, డీజీపీ శివధర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు సైనిక అధికారులు కూడా వేడుకల్లో పాల్గొన్నారు.

ఈ నేపథ్యంలో సికింద్రాబాద్‌ పరిసర ప్రాంతాల్లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రిపబ్లిక్ డే నేపథ్యంలో పరేడ్‌ మైదానానికి వచ్చే సందర్శకులను క్షణంగా తనిఖీ చేసి అనుమతి ఉన్న వారిని మాత్రమే లోనికి అనుమతించారు.

సికింద్రాబాద్‌, ప్యారడైజ్‌, రసూల్‌పుర, ప్యాట్నీ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలను అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్‌ పరిసర ప్రాంతాల్లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు పరేడ్​ గ్రౌండ్​లో జరుగుతున్న గణతంత్ర వేడుకలు జరిగాయి. 

You may also like
republic day in kartavy path
కర్తవ్యపథ్ లో గణతంత్ర వేడుకలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions