Telugu Doctor Died In Australia | ఆస్ట్రేలియాలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు లోయలో పడి ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఓ మహిళ డాక్టర్ మృతి చెందారు.
ఆస్ట్రేలియాలోని రాయల్ బ్రిస్బేన్ ఉమెన్స్ ఆసుపత్రిలో డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ఉజ్వల వేమూరు స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్ వెళ్లారు.
ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి లోయలో పడిపోయారు. దీంతో అక్కడికక్కడే మృతిచెందారు. ఉజ్వల మరణంపై ఆస్ట్రేలియాలోని స్నేహితులు ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు.
కృష్ణా జిల్లా గన్నవరంకు చెందిన ఉజ్వల వేమూరు ఉన్నత చదవుల కోసం ఆస్ట్రేలియా వెళ్లి బాండ్ విశ్వవిద్యాలయంలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు.
అనంతరం అక్కడే వైద్యురాలిగా స్థిరపడ్డారు. తాజాగా జరిగిన ప్రమాదంలో ఆ మృతిచెందడంతో ఆమె స్వగ్రామoలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఉజ్వల కుటుంబసభ్యుల కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నేడు మృతదేహం కృష్ణాజిల్లా స్వగ్రామానికి తరలించారు. ఉంగుటూరు మండలం ఎలుకపాడులో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.





