Saturday 23rd November 2024
12:07:03 PM
Home > తాజా > తెలంగాణ తల్లి విగ్రహం..సీఎం రేవంత్ స్థల పరిశీలన

తెలంగాణ తల్లి విగ్రహం..సీఎం రేవంత్ స్థల పరిశీలన

Telangana Thalli Statue At Secretariat | డా. బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం ( B. R. Ambedkar Telangana State Secretariat )లో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Cm Revanth Reddy ) స్థల పరిశీలన చేశారు. సచివాలయం ఆవరణలో భవన ప్రధాన ద్వారం ముందు భాగం విగ్రహ ఏర్పాటుకు అనువైన ప్రదేశంగా భావించారు.

డిసెంబర్ 9 న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటునకు రాష్ట్ర అధికార కేంద్రమైన సెక్రటేరియట్ సముచితమైన స్థానమని, అక్కడ తెలంగాణ తల్లిని సగర్వంగా, సగౌరవంగా ప్రతిష్ఠిస్తామని స్పష్టం చేశారు.

ఆ తర్వాత విగ్రహ ఏర్పాటుకు ప్రతిపాదిత స్థలం, ఆ ప్రాంతాన్ని తీర్చిదిద్దడానికి అనుగుణమైన డిజైన్ కూర్పుపై అధికారులతో చర్చించారు.

తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని, అందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.

You may also like
గుడ్ న్యూస్.. రూ.5,260 కోట్ల పెట్టుబడులు 12,490 మందికి ఉద్యోగాలు
ktr comments
అప్పు- తప్పు అన్నోళ్లని.. ఇప్పుడు దేనితో కొట్టాలి? : కేటీఆర్
అక్టోబర్ 16న కోర్టుకు రావాలి..సీఎం రేవంత్ కు కోర్టు ఆదేశం
అందుకే స్కిల్ యూనివర్సిటీ ఛైర్మన్ గా ఉండేందుకు అంగీకరించా

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions