Telangana Man Dies of Heart Attack In Qatar | తెలంగాణ కు చెందిన వ్యక్తి గల్ఫ్ లో గుండెపోటుతో మృతి చెందారు. ధర్మపురి నియోజకవర్గంలోని ఎండపల్లి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన ఎనగందుల కిష్టయ్య జీవనోపాధి కోసం ఖతర్ దేశంకు వెళ్లారు. అక్కడ కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అయితే మంగళవారం గుండెపోటుతో కిష్టయ్య మృతి చెందారు.
ఈ విషయాన్ని తెలుసుకున్న కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఖతర్ లో మృతిచెందిన కిష్టయ్య భౌతికకాయాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కోరుతున్నారు. అలాగే గల్ఫ్ పాలసీని కుటుంబానికి అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మృతి చెందిన కిష్టయ్యకు ఇద్దరు పిల్లలు. 12 సంవత్సరాల వయసున్న బాలిక, ఐదు సంవత్సరాల వయసున్న బాబు ఉన్నారు.









