Wednesday 11th March 2026
12:07:03 PM
Home > తాజా > తెలంగాణ విద్యుత్ రంగంలో కీలక నిర్ణయం!

తెలంగాణ విద్యుత్ రంగంలో కీలక నిర్ణయం!

The TG government sets up TGRPDCL.

‌‌- రైతుల కోసం ప్రత్యేకంగా TGRPDCL డిస్కం ఏర్పాటు.

  • కొత్త డిస్కం పరిధిలోకి వ్యవసాయ కనెక్షన్లు, లిఫ్ట్ ఇరిగేషన్, మిషన్ భగీరథ సేవలు

TG Govt Sets up TGRPDCL | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న మూడవ విద్యుత్ పంపిణి సంస్థ రూపుదిద్దుకుంది. రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి విద్యుత్ సరఫరాను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TGRPDCL) ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం చారిత్రాత్మక ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ (TGSPDCL) మరియు ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ (TGNPDCL) రెండు డిస్కంలు పనిచేస్తున్నాయి. తాజాగా మూడవ డిస్కంగా TGRPDCL ను బుధవారం, మార్చి 11, 2026న అధికారికంగా ఏర్పాటు చేశారు.  TGSPDCL కార్పొరేట్ కార్యాలయ ప్రాంగణంలోని B బ్లాక్ లో TGRPDCL యొక్క రిజిస్టర్డ్ కార్యాలయంగా ప్రభుత్వం పేర్కొంది.

ఈ కొత్త సంస్థ పరిధిలోకి రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు (Lift Irrigation Schemes), CPWS / మిషన్ భగీరథ నీటి సరఫరా వ్యవస్థలు, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై & సీవరేజ్ బోర్డు (HMWSSB) పరిధిలోని కనెక్షన్లు, LT VI-B కేటగిరీ పరిధిలోని మునిసిపల్ నీటి సరఫరా కనెక్షన్లు TGRPDCL పరిధిలోకి రానున్నాయి:

TGRPDCL డిస్కం, వ్యవసాయం, CPWS/మిషన్ భగీరథ, HMWSSB, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు మరియు ప్రత్యేక DTRలు (LT VI-B) ద్వారా మునిసిపల్ నీటి కనెక్షన్లకు విద్యుత్ సరఫరా విస్తరణ, కేటాయించిన PPA వాటా ప్రకారం విద్యుత్ కొనుగోలు నిర్వహణ, కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల బోర్డింగ్ ప్రక్రియ నిర్వహణ, TGRPDCL పరిధిలోని ఆస్తులు (DTRలు మరియు LT లైన్లు) నిర్వహణ మరియు మెయింటెనెన్స్, లిఫ్ట్ ఇరిగేషన్, CPWS మరియు HMWSSB వంటి సంస్థల వినియోగ విద్యుత్‌ను DTR మీటరింగ్ మరియు వినియోగదారుల మీటరింగ్ ద్వారా అకౌంటింగ్ చేయడం, అవసరమైన రెగ్యులేటరీ ఫైలింగ్స్ మరియు నిబంధనల అనుసరణ వంటి ముఖ్య కార్యకలాపాలు నిర్వహిస్తుంది.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions