Telangana BJP President sends legal notice to Deputy CM Bhatti Vikramarka | తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచందర్ రావు లీగల్ నోటీసులు పంపారు.
తెలంగాణ బీజేపీ చీఫ్ గా రామచందర్ రావు ఎన్నికయిన నేపథ్యంలో భట్టి స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పీహెచ్డీ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్యకు కారణమైన రామచందర్ రావును రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఎలా నియమిస్తారని ఆయన ప్రశ్నించారు.
రోహిత్ మరణానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోకుండా… పదవులు ఇస్తున్న బీజేపీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో తాజగా భట్టికి రామచందర్ రావు లీగల్ నోటీసులు పంపారు. వేముల రోహిత్ ఆత్మహత్యకు తాను కారణమని భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ నోటీసులు పంపారు.
3 రోజుల్లోగా బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేదంటే రూ.25 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. అంతేకాకుండా క్రిమినల్ కేసులు కూడా ఎదురుకోవాల్సి వస్తుందని నోటీసులో పేర్కొన్నారు. ఈ మేరకు తన అడ్వకేట్ విజయ్ కాంత్ ద్వారా బీజేపీ అధ్యక్షులు నోటీసులు పంపారు.









