India Pak Match | దుబాయ్ వేదికగా జరగుతున్న ఆసియా కప్ లో భాగంగా ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్ లో భారత క్రికెట్ జట్టు పాకిస్థాన్ జట్టును ఓడించిన విషయం తెలిసిందే. భారత బౌలర్ల ధాటికి పాక్ బ్యాట్స్ మెన్ వరసగా పెవిలియన్ చేరారు. పాక్ నిర్దేశించిన 128 లక్ష్యాల్ని భారత బ్యాట్స్ మెన్ అలవోకగా ఛేజ్ చేశారు.
అయితే మ్యాచ్ పూర్తయిన తర్వాత పాక్ క్రికెటర్లతో భారత ఆటగాళ్లు షేక్ హ్యాండ్ కూడా చేయలేదు. నేరుగా డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లిపోయారు. ఈ విషయానికి సంబంధించి మ్యాచ్ ముగిసిన తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ఆసక్తికర సమాధానం ఇచ్చారు.
“మేమిక్కడికి కేవలం క్రికెట్ ఆడేందుకు మాత్రమే వచ్చాం. పాకకు సరైన సమాధానం ఇచ్చామని అనుకుంటున్నా’ అని చెప్పారు. పహల్గాం ఉగ్రదాడి బాధితులకు అండగా ఉన్నామనీ, తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశామని పేర్కొన్నారు.
అలాగే, ఆపరేషన్ సిందూర్ లో ధైర్యసాహసాలు ప్రదర్శించిన మన ఆర్మీకి కూడా అంకితం ఇస్తున్నట్లు చెప్పారు. వారు మనందరికీ స్ఫూర్తినిస్తూనే ఉన్నారనీ, ఇప్పుడు వారికి అంకితం చేయడానికి ఇంతకుమించిన మంచి సందర్భం మరొకటి లేదని సూర్యకుమార్ వ్యాఖ్యానించారు.









