Saturday 12th April 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > పవన్ కళ్యాణ్ తో తమిళనాడు తెలుగు పీపుల్ ఫెడరేషన్ భేటీ!

పవన్ కళ్యాణ్ తో తమిళనాడు తెలుగు పీపుల్ ఫెడరేషన్ భేటీ!

tn telugu poeple meets pawan

TN Telugu People Federation | ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ను, తమిళనాడు తెలుగు పీపుల్ ఫౌండేషన్ ప్రతినిధులు గురువారం భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా భాషా సంస్కృతిని కాపాడుకునేందుకు చేస్తున్న కృషి అభినందనీయమని డిప్యూటీ సీఎం కొనియాడారు.

కాగా తమిళనాడు రాష్ట్రంలో చెన్నై కోయంబత్తూర్, కంచి, మధురై, చెంగల్పట్, తిరుత్తణి ప్రాంతంలో అత్యధికంగా వివిధ రంగాల్లో తెలుగు ప్రజలు స్థిరపడ్డారు.

వారి కోసం గతంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత జయలలిత చెన్నైలో తెలుగు భవనం నిర్మించేందుకు ఆమోదం తెలిపారు. అయితే ఇప్పటికీ ఆ ప్రాజెక్ట్ నిర్మాణం మొదలవలేదు.

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకొచ్చి ఈ భవన నిర్మాణం జరిగేలా, అక్కడి తెలుగు ప్రజలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని వారు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా తమిళనాడులో వారు చేసిన కార్యక్రమాలు ఉప ముఖ్యమంత్రికి వివరించారు. వారిని అభినందిస్తూ, తెలుగు ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తామని డిప్యూటీ సీఎం వారికి తెలిపారు.

You may also like
‘అప్పుడే పాలన అర్ధవంతం అనిపిస్తుంది’
వైఎస్ భారతి పై అసభ్య వ్యాఖ్యలు..వైఎస్ షర్మిల ఏమన్నారంటే !
kiran chebrolu
వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు.. టీడీపీ కార్యకర్త అరెస్టు!
‘రాజులం బాబు రాజులం..నీ కోసం తిలక్ కోసం వచ్చాము’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions