Tamilnadu BJP Chief Annamalai News | ఆరు కొరడా దెబ్బలు భరించి మురుగన్ కు మొక్కు చెల్లించారు తమిళనాడు బీజేపీ అధ్యక్షులు అన్నామలై.
చెన్నైలోని అన్నాయూనివర్సిటీలో ఓ విద్యార్థిని లైంగిక వేధింపులకు గురైన ఘటన కలకలం రేపుతోంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం పై నిప్పులుచేరిగారు అన్నామలై. డీఎంకే ప్రభుత్వాన్ని గద్దె దించేవారకు చెప్పులు ధరించనని ఆయన ప్రకటించారు.
రూపాయి పంచకుండా ఎన్నికలకు వెళ్లనున్నట్లు, విజయం సాధించే వరకు పాదరక్షలు ధరించను అని చెప్పారు. అలాగే రాష్ట్రంలో చెడు అంతమైపోవలని కోరుతూ ఆరు కొరడా దెబ్బలు భరించి, మురుగన్ కు మొక్కు చెల్లిస్తానని అన్నామలై తెలిపారు.
ఈ క్రమంలో శుక్రవారం కోయంబత్తూరు లోని ఆయన నివాసం ఎదుట పార్టీ నేతలు, కార్యకర్తల సమక్షంలో ఆరు కొరడా దెబ్బలు భరించి, మురుగన్ కు మొక్కు చెల్లించుకున్నారు.