SRH Retained Players | ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ ( Mega Auction ) నవంబర్ నెలలో జరగనుంది. ఈ క్రమంలో రిటెన్షన్ ( Retention ) ద్వారా ఏ టీం ఏ ప్లేయర్ ను తమ వద్దే అంటిపెట్టుకుంటుంది అనేది ఆసక్తిగా మారింది.
రిటెన్షన్ ప్లేయర్ల లిస్ట్ ( Players List ) గురువారం విడుదలయ్యింది. 2024 ఐపీఎల్ లో భాగంగా ప్రత్యర్థి టీంలకు ముచ్చెమటలు పట్టించిన ఆటగాళ్లను సన్ రైజర్స్ హైదరాబాద్ ( Sunrisers Hyderabad ) తన వద్దే ఉంచుకుంది. రిటెన్షన్ లో అత్యధిక ధరకు హెన్రిచ్ క్లాస్సేన్ ( Heinrich Klassen ) ను ( Rs. 23cr ) హైదరాబాద్ దక్కించుకుంది.
అలాగే ఓపెనింగ్ లో భీకర ప్రదర్శన కనబరిచిన అభిషేక్ శర్మ ( Abhishek Sharma ) కు రూ.14 కోట్లు, ట్రావిస్ హెడ్ ( Travis Head ) కు రూ.18 కోట్లు చెల్లించి రిటెన్షన్ ద్వారా హైదరాబాద్ దక్కించుకుంది. తన కెప్టెన్సీ ద్వారా హైదరాబాద్ ను అగ్రస్థానంలో నిలిపిన ఫ్యాట్ కమిన్స్ ( Pat Cummins ) ను రూ.18 కోట్లకు రిటైన్ చేసుకుంది.
మరో తెలుగు యువ ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి ( Nitish Kumar Reddy )ని కూడా రూ.6 కోట్లకు హైదరాబాద్ రిటైన్ చేసుకుంది. ఈ ఐదుగురు ప్లేయర్లను రిటైన్ ద్వారా దక్కించుకోవడం ద్వారా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.