- శివాజీ వ్యాఖ్యలకు చిన్మయి, అనసూయ కౌంటర్!
Anasuya Counter To Shivaji | టాలీవుడ్ (Tollywood) నటుడు శివాజీ (Actor Shivaji) ‘దండోరా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ల డ్రెస్సింగ్ పై చేసిన వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో వివాదానికి దారితీశాయి. గత రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన హీరోయిన్ల గ్లామర్ షో పై ఘాటుగా వ్యాఖ్యానించారు.
మహిళల అందం చీరలోనే ఇమిడి ఉందని, అభ్యంతరకరంగా దుస్తులు ధరిస్తే తమ విలువ కోల్పోతారనే అర్థంలో మాట్లాడారు. పొట్టి బట్టలు వేసుకున్న హీరోయిన్లను బయటకి పొగిడినా, లోపల అసహ్యించుకుంటారని వ్యాఖ్యానించారు. సావిత్రి, సౌందర్య వంటి మహానటులను ఆదర్శంగా తీసుకోవాలని, గ్లామర్‌కు ఒక హద్దు ఉండాలంటూ ఆయన సూచించారు.
అయితే, ఈ వ్యాఖ్యల పట్ల పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గాయని చిన్మయి, యాంకర్ అనసూయ భరద్వాజ్ (Anchor Anasuya Bharadwaj) కూడా శివాజీ వ్యాఖ్యలను తప్పు బట్టారు. మహిళలందరూ చీరే కట్టుకోవాలా? అయితే మీరు కూడా జీన్స్, హుడీలు మానేసి ధోతి మాత్రమే ధరించండి అంటూ చిన్మయి (Chinmayi) సోషల్ మీడియాలో పేర్కొన్నారు. “ఇది మా శరీరం.. మీది కాదు. మాకు నచ్చినట్లే మేము ఉంటాం” అంటూ అనసూయ పోస్ట్ చేశారు.









