Friday 30th January 2026
12:07:03 PM
Home > క్రీడలు > డబ్బుకోసమే ధనశ్రీ పెళ్లి..పోస్టుకు లైక్ కొట్టిన రోహిత్ సతీమణి

డబ్బుకోసమే ధనశ్రీ పెళ్లి..పోస్టుకు లైక్ కొట్టిన రోహిత్ సతీమణి

Ritika Sajdeh ‘Likes’ Post Calling Dhanashree Verma ‘Gold Digger’ | టీం ఇండియా స్పిన్నర్ యూజ్వేంద్ర చాహల్ ను డబ్బు కోసమే ధనశ్రీ పెళ్లి చేసుకుందని సోషల్ మీడియా చేసిన పోస్టుకు టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ సతీమణి రితిక సజ్దే ( Ritika Sajde ) లైక్ కొట్టారు.

ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది. ప్రేమ కోసం కాకుండా కేవలం డబ్బు కోసమే చాహల్ ను ధనశ్రీ వివాహమాడిందని అర్ధం వచ్చేలా శుభాoకర్ మిశ్రా అనే జర్నలిస్ట్ సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోకు రితిక లైక్ కొట్టారు.

ఈ నేపథ్యంలో జర్నలిస్ట్ చేసిన విశ్లేషణకు రితిక ఏకీభవించారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. 2020లో పెళ్లి చేసుకున్న చాహల్-ధనశ్రీ విడాకుల కోసం ఇటీవల ముంబయి లోని బాంద్రా ఫ్యామిలీ కోర్టులో ఆశ్రయించారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం మార్చి 20న విడాకులు మంజూరు చేసింది.

ఈ నేపథ్యంలో భరణం కింద చాహల్, ధనశ్రీకి రూ.4.75 కోట్లు ఇవ్వడానికి అంగీకరించారని తెలుస్తోంది. అయితే కోర్టులో విచారణకు హాజరాయిన సమయంలో చాహల్ ధరించిన టీ-షర్టు కూడా చర్చనీయాంశంగా మారిన విషయం తెల్సిందే.

‘బీ యువర్ ఓన్ షుగర్ డాడీ’ ( Be Your Own Sugar Daddy ) అని రాసి ఉన్న టీ-షర్టును చాహల్ ధరించారు. అంటే ఇకనుండి నీ ఖర్చులకు నీవే డబ్బులు సంపాదించుకో అని అర్ధం వచ్చేలా ఆయన టీ-షర్టు ధరించారు.

You may also like
social media code for govt servants
వారు సోషల్ మీడియా వాడాలంటే అనుమతి తప్పనిసరి.. ఎక్కడంటే!
cm revant reddy completes course in usa
అమెరికాలో కోర్సు పూర్తి చేసుకున్న తెలంగాణ సీఎం!
newly married couple photoshoot in tirumala
‘తెలియక చేశాం.. క్షమించండి’.. ఫొటోషూట్ వివాదంపై కొత్త జంట!
మేడారంలో అద్భుత దృశ్యం..జనంలోకి సమ్మక్క

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions