Friday 23rd May 2025
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > RAW మాజీ అధికారిపై అమెరికాలో కేసు..వికాస్ తల్లి ఏమన్నారంటే !

RAW మాజీ అధికారిపై అమెరికాలో కేసు..వికాస్ తల్లి ఏమన్నారంటే !

Raw Agent Vikas News | అమెరికా ( USA )లో ఉంటున్న ఖాలిస్తాన్ ( Khalistan )వేర్పాటువాది, ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు గతేడాది రా మాజీ అధికారి వికాస్ యాదవ్ ( Vikas Yadav ) విఫలయత్నం చేసినట్లు అమెరికా ఆరోపిస్తున్న విషయం తెల్సిందే.

ఈ మేరకు వికాస్ పై అక్కడి జస్టిస్ డిపార్ట్మెంట్ ( Justice Department ) కేసును నమోదు చేసి విచారిస్తోంది. అలాగే ఎఫ్బీఐ వాంటెడ్ లిస్ట్ ( Wanted List ) లో వికాస్ పేరును చేర్చారు. మరోవైపు భారత్ మాత్రం అతడిని ఉద్యోగం నుండి తలగించినట్లు అమెరికాకు వెల్లడించింది.

దీనిపై వికాస్ యాదవ్ తల్లి సుదేశ్ స్పందించారు. అమెరికా మాట్లాడే దాంట్లో ఎటువంటి నిజం లేదని ఆమె కొట్టిపారేశారు.

‘అమెరికా చెప్పేది నిజమో లేక అబద్ధమో తెలీదు కానీ, వికాస్ మాత్రం దేశం కోసం పనిచేస్తున్నాడు’ అని ఆమె చెప్పారు. ఇదిలా ఉండగా వికాస్ భారత్ లోనే ఉన్నాడని యూఎస్ భావిస్తుంది.

You may also like
అమృత్ భారత్ స్టేషన్లను ప్రారంభించిన ప్రధాని
క్యాన్సర్ బారిన పడిన వ్యక్తికి అండగా సీఎం
‘జల్సాల కోసం రూ.172 కోట్లతో హెలికాప్టర్’..YCP vs TDP
‘భారీగా పెరిగిన WTC ప్రైజ్ మనీ..ఎన్ని రూ.కోట్లంటే!’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions