Ratan Tata Rs. 10,000 Crore Will | దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా ( Ratan Tata ) లోకాన్ని విడిచినా ఆయన చేసిన సేవలను దేశం మొత్తం స్మరించుకుంటుంది. లక్షల కోట్లకు అధిపతిగా ఉన్న రతన్ టాటా ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టారు.
అలాగే ఆయనకు మూగ జీవాలు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీది శునకాల ( Street Dogs ) సంరక్షణ కోసం ఆసుపత్రులను సైతం నిర్మించిన గొప్ప మనసు ఆయనది. కాగా టాటా వీలునామాకు సంబంధించిన పలు విషయాలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
తన పెంపుడు శునకం టిటో ( Tito ) సంరక్షణ కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వీలునామాలో రాసినట్లు తెలుస్తోంది. అలాగే గత మూడు దశాబ్దాలుగా తనకు పెర్సనల్ హెల్పర్స్ ( Personal Helpers ) గా ఉంటూ తనకు తోడుగా ఉన్న రాజన్ షా, సుబ్బయ్య పేర్లను సైతం వీలునామాలో టాటా రాశారు.
కాగా గతంలో టిటో అనే శునకాన్ని పెంచుకునున్నారు. అది మరణించిన అనంతరం మరో కుక్కను దత్తత తీసుకొని దానికి కూడా టిటో అనే పేరు పెట్టారు. టిటో సంరక్షణను సుబ్బయ్యకు అప్పగించాలని టాటా తన వీలునామాలో పేర్కొన్నారు.