Ram Gopal Varma Skips Police Investigation | ప్రముఖ దర్శకుడు రాం గోపాల్ వర్మ ( Ram Gopal Varma ) తనకు సమయం కావాలంటూ ఏపీ పోలీసులకు వాట్సప్ ( Whatsapp ) లో సందేశం పంపారు.
వివరాల్లోకి వెళ్తే గతంలో వ్యూహం సినిమా ప్రమోషన్స్ ( Promotions ) లో భాగంగా ఆర్జీవి ( RGV ), ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు ( Cm Chandrababu ), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ( Deputy Cm Pawan Kalyan ) వ్యక్తిత్వాలను కించపరిచేలా రాంగోపాల్ వర్మ పోస్టులు పెట్టారని ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది.
ఈ మేరకు మండల ప్రధాన కార్యదర్శి రామలింగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మంగళవారం ఒంగోలు సీఐ కార్యాలయంలో ఆర్జీవి విచారణకు హాజరుకావాల్సి ఉంది. కానీ విచారణకు ఆయన గైర్హాజరు అయ్యారు. తనకు 4 రోజుల సమయం కావాలంటూ వాట్సప్ లో ఒంగోలు పోలీసులకు మెస్సేజ్ చేశారు.









