Pawan Kalyan warns of ‘Operation Kagar-like clampdown’ on red sanders smugglers | ఎర్రచందనం స్మగ్లర్లకు వార్నింగ్ ఇచ్చారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. తిరుపతి జిల్లా, మంగళంలో అటవీ శాఖకు చెందిన ఎర్ర చందనం గొడౌన్ ను శనివారం మధ్యాహ్నం పవన్ పరిశీలించారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఎర్ర చందనం అక్రమ రవాణా చేస్తున్నవారు తక్షణమే ఆపేయాలని, లేని పక్షంలో ఆపరేషన్ కగర్ తరహాలో స్మగ్లర్లను ఎరివేయడానికి ఆపరేషన్ మొదలుపెడతామని హెచ్చరించారు. ఉపాధి కోసం ఎర్ర చందనం చెట్లు నరికివేసే వారు ఇకపై స్థానిక అధికారులను సంప్రదించి వేరే ఉపాధి మార్గాలు కల్పించేలా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుని రక్త గాయం నుంచి పుట్టిన వృక్ష సంపదను కాపాడుకుందామని పిలుపునిచ్చారు. ఎర్రచందనం అక్రమ రవాణాలో ఆరితేరిన నలుగురు కింగ్ పిన్స్ ను ప్రత్యేకంగా గుర్తించినట్లు పవన్ స్పష్టం చేశారు. ప్రత్యేక చట్టంతో ఎర్రచందనం స్మగ్లర్లు ఆస్తులను స్వాధీనం చేసుకొనున్నట్లు ఉప ముఖ్యమంత్రి చెప్పారు. వారిని ప్రత్యేక వ్యూహంతో పట్టుకొనున్నట్లు తెలిపారు. కడపలో కొన్ని ప్రాంతాల్లో ఎర్రచందనం అక్రమ రవాణా అధికంగా జరుగుతోందన్నారు.









