Monday 16th March 2026
12:07:03 PM
Home > తాజా > కట్టుకథలు అల్లారు..హైకోర్టులో పట్నం క్వాష్ పిటిషన్

కట్టుకథలు అల్లారు..హైకోర్టులో పట్నం క్వాష్ పిటిషన్

Patnam Narender Reddy Quash Petition | వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో అధికారులపై జరిగిన దాడి ఉదంతం రాజకీయ మలుపు తీసుకుంది.

తాజగా లగచర్ల ఘటనలో ఏ1 ( A1 ) నిందితుడిగా ఉన్న పట్నం నరేందర్ రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ ( Quash Petition ) దాఖలు చేశారు. ప్రస్తుతం చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పట్నం న్యాయవాదుల ద్వారా అఫిడవిట్ పంపించారు.

బుధవారం ఉదయం కేబీఆర్ పార్కు ( KBR Park ) వద్ద తనను పోలీసులు అదుపులోకి తీసుకుని, బలవంతంగా కారులో ఎక్కించి వికారాబాద్ డీటీసీకి తరలించినట్లు అఫిడవిట్ లో ఆయన పేర్కొన్నారు. ముందుగా పోలీసులు తన నుండి ఎటువంటి స్టేట్మెంట్ ( Statement ) తీసుకోలేదని, కోర్టులో హాజరుపరిచే 10నిమిషాల ముందు కొన్ని పేపర్లపై సంతకాలు తీసుకున్నట్లు పట్నం పేర్కొన్నారు.

తన నుండి పోలీసులు ఎటువంటి వాంగ్మూలం తీసుకోలేదన్నారు. తనను అక్రమంగా అరెస్ట్ చేసి, కేసులో ఇరికించినట్లు చెప్పారు. కేటీఆర్ ( KTR ) ఆదేశాలతో దాడులు చేయించినట్లు పోలీసులు కట్టుకథ అల్లారని, పోలీసులు చెప్పేదాంట్లో నిజం లేదని తెలిపారు. ఈ క్రమంలో తన స్టేట్మెంట్ ను పరిగణలోకి తీసుకొని విచారణ జరపాలని అఫిడవిట్ లో పట్నం చెప్పుకొచ్చారు.

You may also like
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!
kalvakuntla kavitha
‘ఎస్సీల రిజర్వేషన్లు 18 శాతానికి పెంచాలి’
రాష్ట్రంలో కాంగ్రెస్ బుల్డోజర్ రాజ్యం

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions