Nellutla Ramadevi selected for Kaloji Literary Award | ప్రముఖ కవయిత్రి నెల్లుట్ల రమాదేవిని కాళోజీ సాహితీ పురస్కారం వరించింది. 2025 సంవత్సరానికి గాను కాళోజీ సాహితీ పురస్కారం ఎంపిక కోసం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ గీత రచయిత అందెశ్రీ అధ్యక్షతన నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.
ఈ క్రమంలో నిపుణుల కమిటీ రమాదేవి పేరును ఎంపిక చేయగా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కాళోజీ జయంతిని పురస్కరించుకుని సెప్టెంబర్ 9న తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా రమదేవికి రాష్ట్ర ప్రభుత్వం పురస్కారాన్ని ప్రధానం చేయనుంది.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నెల్లుట్ల రమాదేవికి శుభాకాంక్షలు తెలియజేశారు.
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ రమాదేవి స్వస్థలం. భర్త దివంగత వేముల దేవేందర్. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు. ఆంధ్రా బ్యాంకులో పని చేసిన రమాదేవి సీనియర్ మేనేజర్ గా పదవీ విరమణ పొందారు. మనసు భాష, రమణీయం, రమాయణం, అశ్రువర్షం వంటి అనేక రచనలు చేశారు. అలాగే ‘రమ’ కలం పేరుతో అనేక కార్టూన్లు సైతం వేశారు.









