Monday 12th January 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > స్థానిక సమరం వేళ మహరాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం!

స్థానిక సమరం వేళ మహరాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం!

ajit and sharad powar

Maharashrta Local Elections | మహారాష్ట్ర (Maharashtra)లో జనవరి 15న స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (BMC)తో పాటు 28 కార్పొరేషన్లు, 32 జిల్లా కౌన్సిళ్లు, 336 పంచాయతీ సమితులకు ఒకేవిడతలో పోలింగ్ జరగనుంది.

ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో రెండు వర్గాలుగా విడిపోయిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) తాజాగా పొత్తు పెట్టుకున్నాయి. శరద్ పవార్ అజిత్ పవార్ నేతృత్వాల్లోని ఎన్సీపీ ఎస్పీ (NCP-SP), ఎస్పీపీ(NCP) లు పింప్రీ చిచ్వాడ్ ఎన్నికల బరిలోకి కలిసి దిగనున్నాయి.

ఈ విషయాన్ని స్వయంగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ వెల్లడించారు. ఈ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు జరిగిన చర్చల్లో భాగంగా కలిసి పోటీ చేయాలనే నిర్ణయం తీసుకున్నామని పింప్రీ-చించ్వాడ్ ర్యాలీలో అజిత్ వెల్లడించారు.

మహారాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సివస్తుంటుంది. సీట్ల సర్దుబాటు జరుగుతోంది. త్వరలో అధికారిక ప్రకటన వస్తుంది. పార్టీ కార్యకర్తలు ప్రచారంపై దృష్టిపెట్టాలి. వివాదాస్పద ప్రకటనలకు దూరంగా ఉండాలి” అని మద్దతుదారులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. పుణె మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

You may also like
vehicle2vehicle communication
ఇక వాహనాలూ మాట్లాడుకుంటాయ్!
new vehicle registration in showroom
కొత్త వాహనం కొంటున్నారా.. అయితే మీకో శుభవార్త!
United In Triumph
అంధ మహిళల క్రికెట్ జట్టుకు రిలయన్స్ భారీ నజరానా!
sankranthi holidays
తెలంగాణలో పాఠశాలలకు సంక్రాంతి సెలవుల పొడిగింపు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions