Nagababu Indirect Counter To TDP Leader Varma | జనసేన ( Janasena ) ప్రధాన కార్యదర్శి నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ శుక్రవారం నిర్వహించారు.
జనసేన జయకేతనం పేరుతో ఏర్పాటు చేసిన సభకు జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నాయకులు మరియు మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ హాట్ కామెంట్స్ చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నుండి జనసేనాని పవన్ కళ్యాణ్ గెలుపుకు రెండే ప్రధాన కారణాలు ఉన్నాయని వివరించారు.
ఒకటి జనసేన అధినేట్జ్ పవన్ కళ్యాణ్ అయితే రెండవది పిఠాపురం ( Pitapuram ) జనసైనికులు, ఓటర్లు అని పేర్కొన్నారు. అంతేకాని పవన్ కళ్యాణ్ గెలుపుకు నేనే దోహదపడ్డ అని ఎవరైనా అనుకుంటే అది వారి కర్మ అంటూ సంచలన కామెంట్స్ చేశారు.
ఎన్నికల సమయంలో కూటమిలో భాగంగా పిఠాపురం నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేయగా, టీడీపీ నేత మాజీ, ఎమ్మెల్యే వర్మ పోటీకి దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కూటమి అధికారంలోకి వచ్చాక వర్మకు సముచిత గౌరవం ఇస్తామని స్వయంగా పవన్ కళ్యానే హామీ ఇచ్చిన విషయం తెల్సిందే. ఇదే సమయంలో నాగబాబు చేసిన వ్యాఖ్యలు వర్మకు కౌంటర్ గానే చేశారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.