Minister Ponguleti Srinivas Reddy addresses district reorganisation issues | రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో మండలాల ఏర్పాటు, జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఇష్టానురీతిలో జరిగాయని పేర్కొన్నారు. గత పాలకులు చేసిన అశాస్త్రీయ జిల్లాల పునర్వివిభజనను సరిదిద్దుతాం అని స్పష్టం చేశారు. ఈ మేరకు మంత్రి శాసనసభలో ప్రసంగించారు. తమను పొగిడినవారిని ఒక విధంగా, పొగడని వారికోసం మరో విధంగా, అదృష్ట సంఖ్యను ఊహించుకొని అశాస్త్రీయంగా జిల్లాల విభజన చేశారని బీఆరెస్ పాలనపై విమర్శలు గుప్పించారు.
అశాస్త్రీయంగా జరిగిన మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలను పునర్వ్యవస్థీకరణ చేయనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో కొత్త మండలాలు, డివిజన్ల ఆవశ్యకతను కూడా గుర్తించినట్లు ఈ సందర్భంగా తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో మంత్రి వర్గం ఆమోదంతో, అసెంబ్లీలో చర్చించి సరైన పద్దతిలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు.









