Chiranjeevi Tweets on HHVM Trailer | పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటించిన తాజా చిత్రం ‘హరి హర వీరమల్లు’ (Harihara Veeramallu). క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఏఎం రత్నం నిర్మిస్తున్నారు.
చారిత్రక నేపథ్యంతో తెరకెక్కుతన్న ఈ సినిమా జులై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో గురువారం హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్ (Harihara Veeramallu Trailer) విడుదలయ్యింది. ట్రైలర్ పై పవన్ అప్పీయెన్స్, డైలాగ్స్ పై ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు.
తాజాగా హరిహర వీరమల్లు ట్రైలర్ పై మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కూడా స్పందించారు. సినిమా టీమ్ కి శుభాకాంక్షలు చెబుతూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. “హరి హర వీరమల్లు’ ట్రైలర్ ఎంతో ఉత్తేజంగా ఉంది.
దాదాపు రెండేళ్ల తర్వాత కల్యాణ్ బాబు నుంచి వస్తున్న ఈ సినిమాకి కచ్చితంగా థియేటర్లు దద్దరిల్లిపోతాయి. చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్” అని పేర్కొన్నారు. రామ్ చరణ్ స్పందిస్తూ హరిహర వీరమల్లు ఎంత అద్భుతంగా ఉండబోతోందో ఈ ట్రైలర్ చూపించింది. పవన్ కళ్యాణ్ గారు వెండితెరపై మంచి ట్రీట్ ఇవ్వబోతున్నారు” అని పోస్ట్ చేశారు.