Mallikarjun Kharge News | కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు.
కర్ణాటక ముఖ్యమంత్రిగా అతి త్వరలో ప్రస్తుత ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ బాధ్యతలు స్వీకరించనున్నారని పలువురు నాయకులు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో దీనిపై మీడియా మల్లిఖార్జున ఖర్గేను ప్రశ్నించింది.
ఈ నేపథ్యంలో స్పందించిన ఖర్గే..”ఇది పార్టీ హైకమాండ్ చేతుల్లో ఉంది. హైకమాండ్‌లో ఏమి జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఇది హైకమాండ్‌కు వదిలివేయబడింది. ఎవరూ అనవసరంగా సమస్యలు సృష్టించకూడదు.” అని అన్నారు.
ఈ క్రమంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడ్ని మించిన అధిష్టానం వేరే ఉందా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నాయకులు. ఇదే సమయంలో ఎంపీ తేజస్వి సూర్య స్పందిస్తూ..’కాంగ్రెస్ హై కమాండ్ ఒక దెయ్యం లాంటిది. అది కనిపించదు, వినిపించదు, కానీ అది ఉన్నట్లు అందరూ అనుభూతి చెందుతారు. ఇన్నాళ్లు అందరూ కాంగ్రెస్ అధిష్టానం అని భావిస్తున్న ఖర్గేనే, అది తాను కాదు అధిష్టానం వేరే ఉంది అని చెప్పారు’ అని సెటైర్లు వేశారు.









