Sunday 8th September 2024
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > గ్యాస్ వినియోగదారులకు షాక్.. భారీగా పెరిగిన సిలిండర్ ధర!

గ్యాస్ వినియోగదారులకు షాక్.. భారీగా పెరిగిన సిలిండర్ ధర!

గ్యాస్ ధర పెంపు, ఎల్పీజీ  ధర పెంపు,

LPG price hike today: వంట గ్యాస్ వినియోగదారులకు మరోసారి షాక్ ఇచ్చాయి చమురు కంపెనీలు. గ్యాస్ ధరలను పెంచుతూ పెట్రోలియం సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో పేద, మధ్యతరగతి వర్గాలపై మరోసారి ఆర్థిక భారం పడింది.

 గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరను రూ.50 మేరకు పెంచుతున్నట్లు ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు బుధవారం ప్రకటించాయి.

ఇక కమర్షియల్ సిలిండర్ ధరను రూ.350 మేర పెంచుతున్నట్లు తెలిపాయి.

Read Also: ఘోర రైలు ప్రమాదం.. 32 మంది సజీవ దహనం!

తాజాగా పెరిగిన ధరలతో దిల్లీలో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర.. రూ.1769 నుంచి రూ. 2119.50కు చేరింది. దేశ రాజధానిలో గృ హాల్లో వినియోగించే సిలిండర్ ధర రూ.1053 నుంచి రూ.1103కు చేరింది.

అలాగే కోల్ కతాలో కమర్షియల్ సిలిండర్ రూ. 1870 నుంచి రూ. 2221కు పెరిగింది. ముంబయిలో గ్యాస్ సిలిండర్ ధర రూ. 1721 నుంచి తాజా పెంపుతో రూ. 2071 అయ్యింది. చెన్నైలో ఈ సిలిండర్ ధర రూ. 2268కి చేరింది.

Also Read: బహిరంగ చర్చకు సిద్ధమా.. కేటీఆర్ కు వైఎస్ షర్మిల సవాల్!

ఇక తెలుగు రాష్టాల విషయానికి వస్తే.. తాజా పెంపుతో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.1155కు చేరింది. ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం అక్కడ రేటు రూ. 1161 కు పెరిగింది.

కాగా, గతంలో సిలిండర్ ధర పెరిగితే సబ్సిడీ కూడా పెరిగేది. ఇప్పుడు సబ్సిడీ ఎత్తి వేయడం వల్ల సామాన్యుల జేబులకు భారీగా చిల్లు పడనుంది. 

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions